వీణవంక ఏప్రిల్ 7 (జనం సాక్షి )వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర సీనియర్ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గం ముద్దుబిడ్డ కు శుక్రవారం స్వాగతం పలుకుతూ తన స్వగృహం హైదరాబాదులో కలవడం జరిగింది. అనంతరం తన్నీరు హరీష్ రావు టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ మాలాంటి యువతరాన్ని ఒక మార్గంలో నడపడం కోసం అహర్నిశలు కృషి చేసే మేధావి నాటినుండి నేటి వరకు హుజురాబాద్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తల్లో ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని నింపుతూ మాకు అండగా అనునిత్యం ఉండే ఓ గొప్ప మేధావి మా ప్రియతమ నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి స్వాగతం సుస్వాగతం పలకడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తన్నీరు హరీష్ రావు టీం రాష్ట్ర నాయకులు కాట్రేవుల అజయ్ కోరే రవికుమార్ రాపర్తి అరవింద్ గౌడ్, మ్యాడగొని భరత్ గజ్జల శ్రీకాంత్ సుమ శ్రీకాంత్ సాయి అజయ్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు




