సిపిఐ జిల్లా కార్యదర్శి,లక్ష్మణ్………. తెలంగాణ కు ఇచ్చిన హామీలు నెరవేర్చని పీఎం నరేంద్ర మోడీకి తెలంగాణ లో అడుగు పెట్టే నైతిక హక్కు లేదని మంచిర్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు.శుక్రవారం మందమర్రి యూనియన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు నిరసనగా ఏప్రిల్ 8న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు తెలంగాణకు తీరని అన్యాయం చేసిన నరేంద్ర మోడీ 9 సంవత్సరాల కాలంలో ఈ యొక్క పని కూడా చేయని విభజన హామీలను అమలుచేయని ప్రధాని నరేంద్ర మోడీ వందే భారత్ రైలు ప్రారంభం కొరకు ఎనిమిదో తేదీన హైదరాబాద్ పర్యటన నిరసిస్తూ ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాల వద్ద నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగినది విభజన హామీలైన బయ్యారం ఒక్క పరిశ్రమ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా గిరిజన విశ్వవిద్యాలయం ఇలాంటి రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని నరేంద్ర మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదు
సింగరేణి ప్రైవేటీకరణకు మరల టెండర్లను పిలిచిన కేంద్రం
తెలంగాణకు గుండెకాయ అయినటువంటి సింగరేణిలోని సత్తుపల్లి ఇల్లందులోని కోయగూడెం మందమరిలోని రెండు గనులను మొత్తం నాలుగు బొగ్గు గనులను ప్రైవేటు కరుణకు గతంలో టెండర్లు పిలవడం జరిగింది ఒక గని ఇప్పటికే ప్రైవేటు కరుణ చేశారు మిగిలిన మూడు గనులకు ఎవరు టెండర్ వేయకపోవడంతో మూడు రోజులకు పిలవడం జరిగింది రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సింగరేణి ప్రైవేటీకరణ చేయబోమని 51% సింగరేణి ఉన్నదని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు కొత్తగా వచ్చే ప్రతి సింగరేణి మైను ప్రైవేటీకరణ చేస్తున్నారని దానికి మరల టెండర్లు పిలవడమే నిదర్శనం ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి అబద్ధాలు వాడటం ఆ పదానికి వన్నె తీసుకురాదు
దేశంలో లాభాలతో నడిచే బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉక్కు బొగ్గు రైల్వే విమానాయానం ఆయిల్ కంపెనీలు నౌక శ్రయాలు ఆఖరికి రక్షణ రంగంతో సహా ఒకటేమిటి అన్ని రంగాలను ప్రైవేటు కరణ చేసే చట్టాలు చేయబడ్డాయి ఆదాని లాంటి మోసపూరిత కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని అమ్మి వేస్తూ తిరిగి కార్పొరేటర్లపై ఆధారపడి సర్వభౌ మాత్వాన్ని కోల్పోయే విధంగా మోడీ పూనుకుంటున్నారు తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి బొగ్గు బావుల ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది కార్మికులు తెచ్చుకున్న హక్కులను నేడు నరేంద్ర మోడీ కార్మిక హక్కులను కాలరాస్తున్నాడు
ఈ కార్యక్రమంలో
సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాథన్ సుదర్శన్ ఇప్పకాయల లింగయ్య బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌలు సిపిఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజ్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు నక్క వేంకటస్వామి సిపిఐ నాయకులు ప్రజా సంఘాల నాయకులు రాయబారపు వేంకన్న బండారి రాజేశం మామిడి గోపి ఎలిగెటి వజ్ర తాళ్ళపల్లి వీరయ్య రసూల్ సమెందర్ తదితరులు పాల్గొన్నారు….




