భైంసా రూరల్ ఏప్రిల్ 07జనం సాక్షిబైంసా, గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఆభ్యున్నతికి తోడ్పాటునివ్వాలని ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ కు బైంసా డివిజన్ గౌడ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బైంసా డివిజన్ పర్యటకు వచ్చిన ఆయనను ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి స్థానిక విశ్రాంతి భవనంలో బైంసా డివిజన్ గౌడ కులస్తులు ఘనంగా సన్మానించి పలు సమస్యలను వివరించి పరిష్కారానికి బాధ్యతాయుత భాగస్వామ్యం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నీరా కేఫ్ లలో బైంసా డివిజన్ కు అధిక ప్రాధాన్యత లభించేలా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గౌడ కులస్తులకు లబ్ది చేకూరేలా చూడాలన్నారు.ఇందుకు స్పందించిన ఎమ్మెల్సీ వీజ్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ల దృష్టికి సమస్యలను తీసుకవెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని వెల్లడించారు. ఇందులో గౌడ సంఘం ప్రతినిధులు మురళి గౌడ్, కిషన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అశోక్ గౌడ్, గంగాధర్ గౌడ్, అమర్ కిరణ్ గౌడ్, హన్మగౌడ్, రవి గౌడ్, విజయ్ గౌడ్, మదుసూదన్ గౌడ్, రమేష్. గౌడ్, మోహన్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.




