Saturday, 7 November 2026

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.
ఫొటో : అన్నదానం చేస్తున్న సభ్యులు.
బెల్లంపల్లి, నవంబర్ 27, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి బాధను తగ్గించడానికి తమ వంతు సాయంగా అన్నదానం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన అమ్మఒడి సభ్యులు రొడ్డ హరీష్ – స్రవంతి దంపతుల పెళ్లిరోజు సందర్బంగా 158వ సారి అన్నదానం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. అంతేకాకుండాపేరు తెలపడానికి ఇష్టపడని మరో దాత ఆయన తల్లి జ్ఞాపకార్థం పేదలకు 5 చీరలు పంపిణీ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లేటూరి బస్టాండ్ నందు యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేశామన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు ఈరోజు దాతలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో దాతలు రొడ్డ హరీష్ – స్రవంతి, స్వరూప – సమ్మయ్య, దొబ్బల సాగర్, అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ, గన్నేవరం తిరుమల చారి, రంగ సురేష్, బియ్యాల ఉపేందర్, నాగుల సురేష్, దోమల మధుకర్ – జ్యోతి, ఎండి యూసఫ్, చెందుపట్ల లింగన్న పాల్గొన్నారు.