Thursday, 5 November 2026

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.అన్నదానం చేస్తున్న అమ్మఒడి సభ్యులు.

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 16, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి బాధను తగ్గించడానికి తమ వంతు సాయంగా అన్నదానం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. లెంకల విజయ ద్వితీయ వర్ధంతి సందర్బంగా వారి కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో 181వ సారి అన్నదానం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లేటూరి బస్టాండ్ నందు యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేశామన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు ఈరోజు దాతలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు లెంకల ఓదెలు, మంజిత్ – ప్రియాంక, శ్రావణ్ కుమార్ – దివ్య, జక్కుల విద్యారాణి – కుమారస్వామి, మేకల వనజ – చంద్రశేఖర్, అమ్మ ఒడి సభ్యులు హనుమండ్ల సువర్ణ, అమూల్య, నారాయణ, గన్నెవరం తిరుమల చారి, బియ్యాలా ఉపేందర్, సిద్దమల్ల రఘు, బుకాల రంజిత్, మరాఠి నవీన్, గోపు కిషోర్, శివ, ఎండి యూసుఫ్, చందుపట్ల లింగన్న, పాల్గొన్నారు.