జుక్కల్, ఎప్రిల్ 16,( జనంసాక్షి ),కామారెడ్డి జిల్లా బస్వాపూర్ లో ఆదివారం అఖండ హారినామా సప్తాహా ప్రారంభమైంది.ప్రారంభానికి ముందు విఠలేశ్వరుడికి పూజలు చేశారు.భక్తులకు కంకణం కట్టారు.ఈ సప్తహా వారం రోజులు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గ్రామస్థులు అందరు ఇల్లు, వాకిళ్లు శుభ్ర పరుచుకొని భక్తి శ్రద్ధలతో సప్తహా లో పాల్గొనాలని తెలిపారు.ఈ అఖండ హరినామ సప్తాహ లో ప్రతి రోజు భజనలు, కీర్తనలు, ప్రవచనాలు, కాకడ హారతి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. చుట్టు పక్కల గ్రామాల భజన మండళ్లు,భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.ప్రతిరోజు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని తెలిపారు.




