Wednesday, 4 November 2026

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.అన్నదానం చేస్తున్న అమ్మఒడి సభ్యులు.

బెల్లంపల్లి, జూన్ 4, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి బాధను తగ్గించడానికి తమ వంతు సాయంగా అన్నదానం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. నేటి కార్యక్రమం రాళ్ళబండి సంతోష్ జ్ఞాపకార్థం ఆయన బాల్య మిత్రుల సహకారంతో, శాశ్వత టెంట్ దాత మదీనా టెంట్ హౌస్ ఉస్మాన్ సహకారంతో 189వ సారి అన్నదానం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లేటూరి బస్టాండ్ నందు యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేశామన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు ఈరోజు దాతలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో దాతలు కుటుంబ సభ్యులు ననూమల రాంచందర్ యాదవ్, పెదవేన గట్టయ్య యాదవ్, మర్రి రవికుమార్ యాదవ్, బండ శ్రీనివాస్ యాదవ్, కారుపాకల శ్రీనివాస్, బదగం రాజేష్, హనుమండ్ల చందు, అక్కల మల్లికార్జున్ యాదవ్, అమ్మ ఒడి సభ్యులు హనుమండ్ల సువర్ణ, అమూల్య, మల్లక్క, కుడికాల తేజ అశ్విని, సిద్దమల్ల రఘు, మరాఠి నవీన్, ఎండీ యూసుఫ్, చెందుపట్ల లింగన్న పాల్గొన్నారు.