జనం సాక్షిదుబ్బాక 04 జూన్ 2023సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన జర్నలిస్ట్ అహోబిలం వెంకటేశ్వర్లు పెద్దనాన్న బుచ్చిరాములు ఇటీవల చనిపోయిన విషయం తెలుసుకొని అదివారం వారిని,వారికుటుంబాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. వీరితో పాటు ప్రజా ప్రతినిధులు ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి,పిఏసిఎస్ వైస్ ఛైర్మెన్ కాల్వ నరేష్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌలి,డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య,గన్నె భూమిరెడ్డిపలువురు నాయకులుపరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగాఉంటానానిభరోసాకల్పించారు.అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ రాచకట్ల మైసరాజ్ మాతృమూర్తి శాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందిన విషయాన్నీ తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎంపీటీసీ సంగెపు శోభ స్వామి,ఉప సర్పంచ్ రంగు లక్ష్మి రాజు,బిఆర్ఎస్ మండల నాయకులు ,తుంకి సురేష్,సాల్వెరీ రవి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ వార్డ్ సభ్యులు,గ్రామస్తులు,శేఖర్,తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ అహోబిలం వెంకటేశ్వర్లును వారి కుటుంబాన్ని,మాజీ సర్పంచ్ మైసరాజ్ ను పరామర్శించిన మెదక్ ఎంపీ




