మోమిన్ పేట జూన్ 16 జనం సాక్షితాగిన మైకంలో బావిలో స్నానం చేయడానికి వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మోమిన్ పేట మండల పరిధిలోని చంద్రయన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది మోమిన్ పేట ఎస్సై విజయ ప్రకాష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్ర యన్ పల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల బలవంత్ 22 అతనికి మూడు సంవత్సరాల క్రితం భవానితో వివాహం అయింది వీరికి ఒక కుమారుడు ఉన్నాడు పిచ్చకుంట్ల బలవంతు ప్రతిరోజు తాగి వచ్చి భార్యతో గొడవపడి ఇంటికి దగ్గరలో ఉన్న చెట్టు కింద వెళ్లి పడుకునేవాడు గురువారం రోజు కూడా తాగి వచ్చి భార్య తో గొడవపడ్డాడు గొడవ తర్వాత బావి దగ్గర వెళ్లి స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతకీ తిరిగి రాకపోవడంతో భర్త ఏ చెట్టు కింద పడుకున్నాడు భార్య భవాని ఇరుగుపొరుగు వారితో కలిసి వెతకడం ప్రారంభించింది అదే గ్రామానికి చెందిన హనుమంతు మల్లయ్య బావి దగ్గర బలవంతు చెప్పులు బీడీలకట్ట కొన్ని డబ్బులు ఉన్నాయని గ్రామస్తులు లక్ష్మణ్ మృతుని బంధువులకు తెలిపారు దీంతో బావిలో వెతకగా బలవంతు శవమై కనిపించాడు మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ ప్రకాష్ తెలిపారు
తాగిన మైకంలో బావిలో స్నానం చేయడానికి వెళ్లి యువకుడు మృతి




