జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దమ్మ తల్లి దీవెనలు మంథని నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ వేడుకున్నారు. కమాన్‌పూర్ మండలం పేరపేల్లి గ్రామంలో జరిగిన పెద్దమ్మతల్లి బోనాల జాతర మహోత్సవం లొ ఆమె పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్బంగా నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.




