Thursday, 5 November 2026

అమ్మ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

మోమిన్ పేట జూన్ 10 జనం సాక్షిమోమిన్ పేట మండల కేంద్రంలో అమ్మ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అమ్మ ఆసుపత్రి ఎండి డాక్టర్ చెన్నయ్య శ్రవణ్ మాట్లాడుతూ అమ్మ ఆసుపత్రి మండలంలోని కాక మారుమూల గ్రామాల్లో సైతం సంవత్సర కాలంలోని మంచి ఆదరణ లభిస్తుందని ప్రజలకు సేవా దృక్పథంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచిత మందులను ఉచితంగా అన్ని రకాల టెస్టులను ఉచితంగానే నిర్వహిస్తున్నామన్నారు అతి తక్కువ కాలంలోనే ఇంత ప్రజాదారణ పొందుతున్న అమ్మ ఆసుపత్రి మరింత సేవలందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు డాక్టర్ చెన్నయ్య డాక్టర్ నవీన్ డాక్టర్ సునీత డాక్టర్ మానస రెడ్డి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు