బెల్లంపల్లి, జూన్ 10, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని 20 వ వార్డులో చేపట్టిన నూతన డ్రైనేజీ పనులను శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ఉండాలని ఆదేశించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పనులు సకాలంలో అందుబాటులోకి తేవాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట కౌన్సిలర్లు గోసిక రమేష్, నీలి కృష్ణ, నాయకులు సురేష్, కార్యకర్తలు ఉన్నారు.
డ్రైనేజీ పనులు పరిశీంచిన ఎమ్మెల్యే.




