అయిజ మండలంలో వ్యక్తి దారుణ హత్య 

అయిజ,జూన్ 07 (జనం సాక్షి):
అయిజ మండలం మేడికొండ.గ్రామంలో భగ్గుమన్న పాత కక్షలు.
గ్రామం సమీపంలో వ్యక్తి దారుణ హత్య. మృతుడు మెడికొండ గ్రామానికి చెందిన శాస్త్రి చిన్న ఈశ్వర్ గా గుర్తింపు.
గతంలో 2015 లో పెదయ్య అనే వక్తిని చంపిన కేసులో ముద్దాయిగా ఉన్న ఈశ్వర్ . బుల్లెట్ బండి మీద వేలుతున్న ఈశ్వర్ ను  వెనుకనుండి సుమో వెహికల్ తో  ఢీకొట్టి గొడలి కొడవలితో నరికి పరారైన గుర్తుతెలియని వ్యక్తులు.
ఆ ఊరిలో భగ్గుమన్న పాత ఫ్యాక్షన్ కక్షలు.
అక్కడ కత్తులతో సమాధానం చెప్పేవారు.
ఏడాదికి ఒక బలిదానం గ్రామంలో వితంతువుల శోక వినిపించేది.
పగలు ప్రతీకారాలు తో రగిలిపోయే ఆ గ్రామం గత కొద్ది కాలంగా.
ఆ రావణ కాష్టం ఆరింది కత్తుల రక్తదానం తీరింది ప్రస్తుతం  ప్రశాంతంగా ప్రజలు జీవిస్తున్న కాలంలో.
మళ్లీ తెరపైకి పాత కక్షలు మొదలయ్యాయి
ప్రశాంతంగా ఉంటున్న అయిజ మండలం లో నిన్న అనుమానాస్పద హత్య.
నేడు ఈశ్వర్ హత్య తో  మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సిఐ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ
మెడికొండ గ్రామానికి చెందిన చిన్నఈశ్వర్  35 సంవత్సరాలు అనే వ్యక్తిని కొంతమంది గుర్తుతెలియని దుండగులు సుమో వాహనంలో వచ్చి గొడ్డలి, కొడవళ్లతో దారుణంగా హతమార్చారు.
ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని తెలిపారు.
పాత కక్షలే కారణమని ఈయన ఇంతకు ముందు పెదయ్య అనే  వ్యక్తి ని మర్డర్ చేసాడు అని పైన మర్డర్ కేస్ ఉంది దినికి గలా కారణం పాత కాక్షలే అని అన్నారు.
ఫ్యాక్షన్  విలేజ్ కావడం వలన ఇద్దరు ఎస్ఐలు మరియు 15 మంది కానిస్టేబుళ్లను బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
ఏలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం.
ఇంకా పూర్తి దర్యాప్తు చేయాల్సింది ఉంది అని అన్నారు.