టేకులపల్లి, ఏప్రిల్ 14( జనం సాక్షి): అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో, బేతంపూడి గ్రామంలోని కోదండ రామాలయంలో అయ్యప్ప స్వామి జన్మదినమును పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజాకార్యక్రమాలు భక్తులు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బేతంపూడి లో నటరాజ్ గురుస్వామి అధ్వర్యంలో కోదండరామాలయంలో జరిగినాయి. టేకులపల్లి శ్రీ కోదండ రామాలయంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి టేకులపల్లి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి, మహానదానాన్ని భక్తులకు ఏర్పాటు చేశారు. బేతంపూడి గ్రామ అయ్యప్ప భక్త బృందం అధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు గుత్తా చంద్రశేఖర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవాధ్యక్షులు కొప్పు రావూరి భాస్కర్ రావు,గురుస్వాములు నరసింహారావు, సురేష్, శ్రీనివాసరావు,శ్రీను,సాంబ,రాము,రామనర్సయ్య, ప్రసాద్,సాయి, వీరేందర్ పాల్గొన్నారు.




