Thursday, 5 November 2026

లక్ష్మీ సీడ్స్ వారి లక్ష్మీ సిక్కా సంకరజాతి మొక్కజొన్న విత్తనాల క్షేత్రప్రదర్శన

 

 

 

 

గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 14 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని రామాపురం గ్రామంలో కృష్ణ అనే రైతు పొలంలో శుక్రవారం లక్ష్మీ సీడ్స్ వారి లక్ష్మీ సిక్కా సంకరజాతి మొక్కజొన్న విత్తనాల ప్రదర్శనను నిర్వహించారు.లక్ష్మీ సీడ్స్ వారు నూతనంగా ఉత్పత్తి చేసి, రైతులకు విడుదల చేసినటువంటి లక్ష్మీ సిక్కా అనే సంకరజాతి మొక్కజొన్న విత్తనం రైతు కృష్ణ  తన 4 నాలుగు ఎకరాల పొలంలో యాసంగి పంటగా నాటుకోవటం జరిగిందనీ,ఈ మొక్కజొన్న విత్తనాల గురించి కంపనీ రీజనల్ మేనేజర్ గంగా రెడ్డి అన్నారు. లక్ష్మీ-సిక్కా విత్తనాలు నాటుకుంటే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఈ రకంలో ప్రతీ మొక్కజొన్న కండెకి 16 నుండి 18 వరుసలు కలిగిఉండి,అధిక బరువుతో కూడిన మంచి ముదురు నారింజ రంగు గింజలు,అధిక రోగనిరోధక శక్తి వుండడంవలన రైతులకు పురుగుమందు పిచికారీ ఖర్చు చాలా తక్కువ తద్వార అధిక దిగుబడి మంచి మార్కెట్ ధర ఇలాంటివిశిష్ట లక్షణాలను వివరించారు. క్షేత్రస్థాయి ప్రదర్శనలో శాంతినగర్ మార్కెట్ కి చెందిన శక్తి ట్రేడర్స్ యజమాని కోయిల దీన్నే సర్వేశ్వర్ రెడ్డి, భాగ్యలక్ష్మి అగ్రోస్ యాజమానులు అలాగే రామాపురం  చుట్టు పక్కల 6 గ్రామాల రైతులు 120 మందికి పైగా హాజరుకావడం జరిగిందనీ ఆయన అన్నారు.