Thursday, 5 November 2026

అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులుగా బలరాముడు

 

 

 

 

 

 

టేకులపల్లి, ఏప్రిల్ 14 (జనం సాక్షి ): అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి టేకులంపల్లి మండల నూతన అధ్యక్షులుగా మిట్టపల్లి బలరాముడు ఎన్నికయ్యారు. అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో భక్తిశ్రద్ధలతో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మహానుభాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మండల కమిటీని ఎన్నుకున్నారు. టేకులపల్లి మండల అధ్యక్షుడిగా మిట్టపల్లి బలరాముడు, మండల కార్యదర్శిగా ధరావతు లాలునాయక్ లను అధికారికంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి  అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుత్త  చంద్రశేఖర్, ఇల్లందు అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ భాస్కర్, టేకులపల్లి గురుస్వాములు గుండా నరసింహారావు,గుడిపూడి మోహన్ రావు, తోటకూరి జయంత్,మాన్సింగ్ నాయక్, ముత్తు స్వామి, అశోక్ స్వామి పాల్గొన్నారు.