హుజూర్ నగర్ ఏప్రిల్ 14 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని తిలక్ నగర్ లో అంబేద్కర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు కోలపూడి యోహాన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, 15వ వార్డు కౌన్సిలర్ కోట నరసింహారావు, కే ఎల్ ఎన్ రావు, 14వ వార్డు కౌన్సిలర్ ఇందిరాల త్రివేణివెంకటేష్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని దేశం గర్వించేలా ప్రతి పౌరునికి న్యాయం జరిగేలా కుల, మత, జాతులు అందరూ సమానులే అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఓటు వేసే హక్కును కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అంబేద్కర్ అసోసియేషన్ కమిటీ వారు అతిధులకు చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మకొమ్మ యోనా, మాదా ఏసు, మామిడి ఇమ్మానియేల్, కుడితొట్టి ఇర్మియ, కోలపూడి ఏసురత్నం, దగ్గుపాటి బాబురావు, కోల్లపూడి డేవిడ్, అంగన్వాడి టీచర్ ఇట్టిమల్ల రేణుక, మామిడి బెంజిమేన్, ఇశ్రాయేలు, యాకోబు, కోల్లపూడి శ్యామ్, నూకతొట్టి ప్రమోద్, కోల్లపూడి రవి, రమేష్, కోల్లపూడి జాన్ వెస్లీ, రాగి నిఖిల్ పండు, పేతురు, నాగార్జున, శివనేని అబ్రహం, దినేష్, విక్రమ్, చింతమల్ల ప్రసాద్, సతీష్, ఏసు, తుమ్మకొమ్మ రోజమ్మ, మామిడి నేలమ్మ, కోల్లపూడి పద్మ, జ్యోతి కుమారి, దగ్గుపాటి జ్యోతి, కోలపూడి హేమలత, బయమ్మ, పద్మ, లలితమ్మ, కాంతమ్మ, సూర్యమ్మ, ఆపిరమ్మ, రేవతి , సుగుణ, నాగేంద్ర, శ్రీవిద్య, భాగ్యమ్మ, కమల, సుబ్బు, మరియమ్మ, స్వప్న, యువకులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.




