అయ్యప్ప మాలధారులకు
అన్నదానం కొండమల్లేపల్లి పట్టణ వాస్తవ్యులు బూడిద వెంకటయ్య జ్యోతి దంపతులు
కొండమల్లేపల్లి డిసెంబర్ 8 జనం సాక్షి న్యూస్ :
కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శ్రీ సీతా రామాంజనేయ చంద్రమౌళీశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప మాల ధారులకు బూడిద వెంకటయ్య జ్యోతి దంపతులు గురువారం అన్నదానం నిర్వహించారు. అంతకు ముందు వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి దీక్షపరులకు అన్నదానం కల్పించడం మహాపుణ్యమని అంతటి మహా పుణ్య ప్రసాదాన్ని తనకు కల్పించిన అయ్యప్ప భక్త సమాజానికి రుణపడి ఉంటానని అన్నదాత తెలిపారు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం అభినందనీయమని ఈ అన్నదానం కార్యక్రమ ఏర్పాటుకు కృషి చేసిన కొండమల్లేపల్లి పట్టణ వాస్తవ్యులు బూడిద వెంకటయ్య జ్యోతి దంపతులకు శ్రీ అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు నిష్టతో అయ్యప్ప స్వామికి పూజలు చేసే స్థానిక భక్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన అయ్యప్ప దీక్షపరులకు మధ్యాహ్న భిక్ష ఏర్పాటు చేయడం నిర్వాహకులు భక్తులకు వరించిన స్వామి శరణమే అన్నారు కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి బొడిగె బాలరాజు గౌడ్,గురుస్వామి ప్రభాకర్ రెడ్డి, బొడిగె సాంబశివ గౌడ్ గురుస్వామి, బూడిద మల్లేష్ యాదవ్, గురు స్వాములు స్వాములు భక్తులు తదితరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయ్యప్ప మాలధారులకు




