Friday, 6 November 2026

అయ్యప్ప వేషంలో ఎర్రదొంగలు

తిరుపతి,నవంబర్‌15(జ‌నంసాక్షి): రేణిగుంట సవిూపంలోని క్రిష్ణాపురం వద్ద గురువారం టాస్క్‌ ఫోర్స్‌ కూంబింగ్‌ కొనసాగింది. అయ్యప్ప స్వామి భక్తుల ముసుగులో ఇన్నోవా వాహనంలో ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తుండగా.. వారిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందం ప్రయత్నించింది. అధికారులను గమనించిన స్మగ్లర్లు పరారయ్యారు. స్మగ్లర్లు ధరించి వదిలిపెట్టిన నల్ల దుస్తులతో పాటు 9 ఎర్ర చందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలానికి టాస్క్‌ ఫోర్స్‌ ఐజి కాంతారావు చేరుకున్నారు.