విజయవాడ,నవంబర్15(జనంసాక్షి): అన్నవరప్పాడు వెంకటేశ్వర స్వామి వారిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అవినీతి లేని సమాజం కోసం రాజకీయాల లోనికి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చానని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు వస్తున్నానని అన్నారు. అసెంబ్లీ లేక పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేస్తారా అని విలేకరులు ప్రశ్నించడంతో ఆ విషయాలు త్వరలో వెల్లడిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగేంద్ర మురళీ కృష్ణ, గ్రామస్థులు పాల్గొన్నారు.




