Tuesday, 3 November 2026

అయ్యప్ప స్వామి ఆలయంలో చైర్పర్సన్ పుట్ట శైలజ ప్రత్యేక పూజలు

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న స్వామి వారి మహాకుంభ అభిషేక కార్యక్రమంలో మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ సోమవారం పాల్గొని, అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామి వారి ఆశీస్సులతో మంథని ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.