Tuesday, 3 November 2026

వార్డు సందర్శన చేపట్టిన చైర్పర్సన్ పుట్ట శైలజ

జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ వార్డు సందర్శన చేపట్టారు. చెత్త, చేదరాల తొలగింపు, పరిసరాల పరిశుభ్రత పనులను ఆమె పర్యవేక్షించారు. అనంతరం చాకలి ఐలమ్మ చౌక్ నుండీ ప్రధాన చౌరస్తా అంబేడ్కర్ చౌరస్తా వరకు స్వీపింగ్ మెషీన్ తో పట్టణ ప్రధాన రహదారి పై జరుగుతున్న పరిశుభ్రత పనులను దగ్గరుండి చేయించారు.