అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*
రామన్నపేట డిసెంబర్ 10 (జనంసాక్షి) అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలోని బోగారం గ్రామంలో శనివారం అత్యంత వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. బోగారం గ్రామంలో మహా పడిపూజా మహోత్సవం ఘనంగా నిర్వహించినారు. శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు మాలధారణ గావించి నలభై ఒక్క రోజులపాటు కఠినమైనటువంటి దీక్షలు చేపట్టి అనంతరం ఇరుముడి కట్టుకొని శబరిమలై వెళ్లి శ్రీ అయ్యప్ప స్వామికి మొక్కులు సమర్పించుకుంటారని అన్నారు.
అనంతరం నీర్నెముల గ్రామానికి చెందిన వల్లే శేఖర్ రెడ్డి కూతుర్ల పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమం భోగారంలోని సాయిరాం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించడం జరిగింది. అలాగే లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ ఉప్పు ప్రకాష్ దంపతుల సిల్వర్ జూబ్లీ వేడుకలు మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ రెడ్డి కార్యదర్శి పోషబోయిన మల్లేశం నాయకులు పున్న జగన్మోహన్, మందడి రవీందర్ రెడ్డి, నీల దయాకర్ సర్పంచులు గుత్త నర్సిరెడ్డి, ఎడ్ల మహేందర్ రెడ్డి, అప్పం లక్ష్మీ నర్సు, ముత్యాల సుజాత, కడమంచి సంధ్య ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్ రెడ్డి, గోగు పద్మ, గాదె పారిజాత, గొరిగి నరసింహ నాయకులు బొక్క మాధవరెడ్డి, బత్తుల శంకరయ్య, బొక్క పురుషోత్తం రెడ్డి, పున్న వెంకటేష్, కూనూరు ముత్తయ్య, బత్తుల వెంకటేష్, సల్ల సత్య ప్రకాష్, రామ్ శివకుమార్, బొల్లం సతీష్, పొడిచేడు కిషన్, బొడ్డు అల్లయ్య , ఆవుల శ్రీధర్, గర్దాసు విక్రం, మల్లం మల్లయ్య, గంజి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.




