బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
-కలెక్టర్ శశంక
మహబూబాబాద్ బ్యూరో-డిసెంబర్ 10(జనంసాక్షి)
కొత్తగూడ ఆస్పత్రిలో జరిగిన మృతి సంఘటనపై తప్పనిసరిగా విచారణ జరిపిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. శనివారం కొత్తగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన సంఘటనపై కలెక్టర్ స్పందించారు. తక్షణం పూర్తి వివరాలు అందజేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేస్తూ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో చిద్దబోయిన లచ్చమ్మ (72)భర్త ముత్తయ్య కొత్తగూడ స్థానికుడు అయిన లచ్చమ్మ ఆరోగ్యం రీత్యా ఛాతీ నొప్పి రావడం వలన కొత్తగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనకు తీసుకుని రావడం జరిగిందన్నారు. వైద్యుల సలహాతో స్టాఫ్ నర్స్ లు ప్రథమ చికిత్స చేసి పెద్ద ఆసుపత్రికి పంపే క్రమంలో చనిపోవడం జరిగిందని వైద్యులు వివరించినట్లు చెప్పారు. అదేవిధంగా ఆ ఏరియా జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అంబరీష కొత్తగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనికి చేరుకోని జరిగిన విధానం తెలుసుకొని మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం తెలపడం జరిగిందన్నారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు




