అయ్యప్ప స్వామి పై, దీక్షాపరులపై మత చాందసవాది వ్యాఖ్యలకు ఖండన
* బైరినరేష్ పై చర్యలు తీసుకోవాలని గురుస్వాముల డిమాండ్
టేకులపల్లి,డిసెంబర్ 31( జనం సాక్షి ):
బైరి నరేష్ ఇటీవల ఓ సభలో చేసిన అనుచిత వాక్యాలపై వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటూ శనివారం అయ్యప్ప స్వామి దీక్షపరులు( గురు స్వాములు ) డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. హిందూ దేవతలపై అనుచిత వాక్యాలు చేయడం సబబు కాదని, బైరి నరేష్ పై పిడి యాక్ట్ నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు నటరాజు స్వామి, మిట్టపల్లి బలరాం స్వామి, మోహన్ రావు స్వామి, గుండా నరసింహారావు స్వామి, సంతు లాల్ స్వామి ఉన్నారు.




