జనం సాక్షి, జనవరి 26,భువనగిరి (ఆర్. సీ) న్యూస్ ;భువనగిరి పట్టణ 23వ వార్డు ఇందిరానగర్ లో బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో,అరుంధతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటలలో విజేతగా గెలిచిన విద్యార్థి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్వాతంత్రం 1947లో వచ్చింది. కానీ భారతదేశ ప్రజలకు బానిససత్వాన్ని నిర్మూలన చేయడానికి ఒక గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లిక్కించబడ్డ భారత రాజ్యాంగం అమలలోకి తీసుకువచ్చిన దినాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కులంం, మతం, జాతి ఎలాంటి విభేదాలు లేకుండా భారత దేశ ప్రజలందరూ సమానమని, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో ప్రత్యేక రిజర్వేషన్లు పొందుపరిచి సమ సమాజంలో అందరితో సమాన హక్కులు కల్పించిన గొప్ప మహోన్నవ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అలాంటి మహోన్న వ్యక్తి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కంకణబద్ధులై పని చేయాలని నేటి బాలలే రేపటి పౌరులు ముఖ్యంగా మీరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల వివక్షతో అంటరానితనంతో ఆయన పడ్డ బాధలు ఆయన అనుభవించినా కష్టాలు అవమానాలు భారతదేశ ముందు తరాలు ప్రజలు విద్యార్థులు అంటరానితనానికి దూరంగా ఉండాలని రచించిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు చదువుకోవాలని అంబేద్కర్ జీవిత చరిత్ర వినాలని అన్నారు. ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి సభ్యులు ఈశ్వర్ బాబు చిలివేరు రమేష్ భరత్ గోపే బాబు, నరేష్, దేవేందర్, మహేష్, నరసింహ, యాదగిరి, కిషన్ , రాజలింగం, మైసయ్య రేణుక, నిర్మల, విద్యార్థినీ విద్యార్థులు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.




