మల్దకల్ జనవరి 26 (జనంసాక్షి)మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలఎన్ఎస్ఎస్ వాలంటీర్లజాతరలో చేసిన సేవలనుగుర్తించిన వారికి ప్రశంసా పత్రాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, కార్యనిర్వాహణ అధికారి సత్య చంద్ర రెడ్డి గురువారం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వారి ప్రోగ్రాం ఆఫీసర్ల పర్యవేక్షణలో ప్రిన్సిపాల్ అనుమతితో వారం రోజులపాటు జాతరలో భక్తులకు మంచి సేవలు అందిస్తూ జాతర ప్రశాంతంగా జరగడానికి వారి తోడ్పాటు అమోఘమని ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావుఅన్నారు.కార్యనిర్వాదికారి సత్య చంద్రా రెడ్డి మాట్లాడుతూ జాతరలో భక్తులకు సేవలు అందించడం వలన వాలంటీర్లలో భక్తి భావం పెంపొందడంతోపాటు ఏకాగ్రత క్రమశిక్షణఅలవడుతుందన్నారు.జాతరలో వారం రోజులపాటు వాలంటీర్లు భక్తులకు క్యూలైన్ మైంటైన్ చేయడం వృద్ధులకు ప్రత్యేక దర్శనము తప్పిపోయిన పిల్లలను వెతికి వారి తల్లిదండ్రులకు చేర్చడం అన్నదానం లాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు వివిధ సేవలు చేశారని ప్రిన్సిపాల్ ఎం రమేష్ లింగం అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రశంసా పత్రంతో పాటు ఒక బహుమతి విద్యార్థులకు అందజేశారు.వాలంటీర్ల సేవలు అందించినందుకు ప్రిన్సిపాల్ ఎం రమేష్ లింగంకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు రామాంజనేయులు గౌడు, నరసింహులు ప్రత్యేక ధన్యవాదములు చైర్మన్, కార్యనిర్వహణ అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు,పద్మా రెడ్డి,ఆలయ సిబ్బందికళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.




