హుజూర్ నగర్ జనవరి 26 (జనం సాక్షి): భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కోలా నాగేశ్వరరావు అన్నారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంను ప్రపంచ దేశాలు ఎంతో గౌరవిస్తున్నాయని అన్నారు. స్వాతంత్రం పోరాటం చేసిన ఎంతో మంది మహానీయుల త్యాగాలతో నిండిన భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారిందన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి జీవిస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి మహోన్నతులు ఈ దేశం కోసం పోరాటాలు చేశారని అన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయని అన్నారు. భారత్ సర్వమతాల సమ్మేళనం అన్నారు. ఐజేయు యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణం అన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని అన్నారు. ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ వైద్యశాలలో హెల్త్ కార్డులు మంజూరి సక్రమంగా అమలయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలమరి శ్రీనివాసు, దేనమకొండ శేషంరాజు, కితా రామనాదం, దేవరం రామిరెడ్డి, షేక్ జానీ పాషా, రాంప్రసాద్ గౌడ్, పెందుర్తి భాస్కర్, బసవోజు శ్రీనివాస చారి, కోమరాజు అంజయ్య, టీవీఎల్ , దయాకర్ రెడ్డి, దేవరం వెంకటరెడ్డి, ఇట్టిమల్ల రామకృష్ణ, రమేష్ బాబు పాల్గొన్నారు.




