Tuesday, 3 November 2026

అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం కలికో పుల్ ఆత్మహత్య

cm2అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలికో పుల్ ఆత్మహత్య చేసుకున్నారు.అధికారిక నివాసంలో కలికో పుల్ ఉరేసుకొని చనిపోయారు. గత నెల సీఎం పదవికి రాజీనామా చేసిన కలికో పుల్.. అప్పటి నుంచి పెద్దగా బయటకు రావడం లేదు. బీజేపీతో కలిసి అలయెన్స్ ఏర్పాటు చేసిన ఆయన…ఫిబ్రవరిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కోర్టు ఆదేశాలతో.. ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అతి చిన్న వయసులో అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మొదట కాంగ్రెస్ నుంచి ఎన్నికైన ఆయన.. కొందరు ఎమ్మెల్యేలతో కలిసి రెబెల్ గా మారారు. కలికో పుల్ మృతి పట్ల మాజీ సీఎం నబుం తకీ సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *