మంచిర్యాల,జనంసాక్షి సాధారణంగా మే నెలలో పూసే అరుదైన అందమైన “మే పుష్పం” వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనేక కారణాల వలన జూన్ నెలలో కనిపించి సాంబరాశ్చర్యం కలిగించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్ నివాసి పర్యావరణ వేత్త, తెలంగాణ రాష్ట్ర గ్రీన్ కోర్ పర్యావరణ విద్యా శిక్షకుడు గుండేటి యోగేశ్వర్ టెర్రస్ గార్డెన్ మిద్దె తోటలో మే..పుష్పం జూన్ నెల చివరి వారంలో సోమవారం పూసి చూపరులకు ఆశ్చర్యంగా ఆకట్టుకుంది.
ఇది సాధారణంగా లిల్లీ మొక్కను పోలి ఉంటుంది. బంతి పువ్వు ఆకారంలోఎర్రని రంగులో శాఖలుగా విస్తరించి చూపరులను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.అందుకే దీనిని “స్కా డోక్స స్ మల్టీఫోరస్ ” శాస్త్రీయ నామం తో పిలుస్తారు. ఆంగ్లం లోబ్లడ్ ఫ్లవర్, ఫుట్బాల్ అని ,తెలుగులో వాడుక భాషలో మే నెలలో పూ యడం వలన
మే పుష్పం అని పిలుస్తుంటారు ఈ పుష్పం మొగ్గ దశ నుండి పూర్తిగా విచ్చుకోవటానికి సుమారు ఇరవై రోజులు పడుతుంది. ఒకటి నుండి రెండు ఫీట్ల ఎత్తు వరకు ఆకులను కలిగి ఉంటుంది. దీని గడ్డ ఒకసారి నాటుకున్నట్లయితే దీనికి మరణం ఉండదు. అందుకే మరణం లేని మహా మొక్క అని కూడా అంటారు. లిల్లీ మొక్కను పోలి ఉన్న గడ్డ నుండి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఒక గడ్డ నుంచి ఒక పుష్పం మాత్రమే రావటం ఎంతో విశేషం.. ఈ పుష్పాన్ని తనివి తీర చూస్తే మానసిక ఆనందం కలుగుతూ ఒత్తిడి దూరమవుతుందని విశ్లేషనలు ఉన్నాయి. వీటి ఆకులను సైతం అలంకరణలో మరియు ల్యాండ్ స్కేటింగ్ లో వినియోగిస్తుంటారు. కాగా మానవ తప్పిదాల వలన కలుగుతున్న వాతావరణం మార్పులు ,పెరుగతున్న అధిక భూతాపం ప్రధాన కారణం అవుతుందని కావున ప్రతి మనిషి భూతాపాన్ని తగ్గించే చర్యలు పాటిస్తూ పర్యావరణ మిత్రులుగా మారాలని తెలిపారు.




