జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ కల్పించాలని, రెండవ పిఆర్సి నియమించి 2023 నుండి అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న రెండు డీఆర్ లను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటేశం, కార్యదర్శి సంజీవులు, కోశాధికారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు
రిటైర్డ్ ఉద్యోగులకు ఈ హెచ్ ఎస్ ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి




