దౌల్తాబాద్ జూన్ 26, జనం సాక్షి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు దౌల్తాబాద్ మండల పరిధిలో గాజులపల్లి గ్రామంలో విద్యార్థి, యువత కమిటీలు ఏర్పాటు చేశారు. యూత్ అద్యక్షులుగా నిఖిల్ రెడ్డి , ఉపాధ్యక్షులుగా ఎండి షాదుల్ , బిఆర్ఎస్వీ అద్యక్షులుగా బి ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా పి ప్రభాకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బిఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు సంబారపు నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్య, వైద్య, ఐ టి రంగాల్లో అభివృద్ధి చెందింది. దేశంలో ఎక్కడలేని విధంగా సాక్ష్యం పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ప్రతి గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు మోహన్ రావు, బిఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు సంబారపు నాగరాజు, గాజులపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అద్యక్షులు చంద్రం, బిఆర్ఎస్వీ దౌల్తాబాద్ అద్యక్షులు ఆనంద్, దౌల్తాబాద్ మండల బిఆర్ఎస్వీ నాయకులు ప్రేమ్ కుమార్, పంజా స్వామి, సుమన్, సత్యపాల్, పాశం ప్రభాకర్, గ్రామ యువత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.




