Saturday, 7 November 2026

అర్హులందరిని ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి

అర్హులందరిని ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి

వీణవంక నవంబర్ 26 (జనం సాక్షి)
వీణవంక మండలం కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో నేడు శనివారం ఆదివారం అర్హులైన పతి ఒక్కరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి తిరిగి డిసెంబర్ 3వ తేదీలలో 4వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మండల తహసిల్దార్ రాజయ్య శనివారం తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేకంగా సవరణ 20 23 భాగంగా శనివారం ఆదివారం డిసెంబర్ 3 వ 4 వ తేదీల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్ లో 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు నూటికి నూరు శాతం ఓటర్గా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు వారి వెంట ఆధార్ కార్డు మరియు చదువుకున్న సర్టిఫికెట్ . ఓటర్ నమోదు చేసుకునే వారు అదే సమయంలో ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని అన్నారు ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు మృతి చెందిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు సంబంధింత ఫారం 7 ఫారం 8 లను సేకరించి ఓటరు గుర్తించి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాము అని అన్నారు. తప్పకుండా ప్రతి ఓటరు హక్కును వినియోగించుకున్న తీరును వివరిస్తూ అన్ని మండలం లోని గ్రామాల్లో ప్రతి బూత్ స్థాయి సంబంధించిన అధికారులకు అవగాహన కల్పించారు సంబంధింత పోలింగ్ కేంద్రానికి ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు ఉంటారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆర్ ఐ. ప్రవీణ్ కుమార్, రవీందర్ తోపాటు వి ఆర్ ఏ లు ఆయా గ్రామాల బిఎల్వో లు తదితరులు పాల్గొన్నారు