Saturday, 7 November 2026

ఘనంగా 74 వ ఎన్ సి సి ఆవిర్భావ వేడుకలు

ఘనంగా 74 వ ఎన్ సి సి ఆవిర్భావ వేడుకలు

ఎన్ సి సి జెండాను ఎగరవేసిన స్థానిక ఎస్సై నవీద్

గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (26): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 74వ ఎన్ సి సి ఆవిర్భావ వేడుకలు ను ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణంలో ఎన్ సి సి జెండాను స్థానిక ఎస్సై నవీద్ ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ సి సి విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకొని సామాజిక సేవను అలవర్చుకోవాలని జాతీయ సమైక్యతకు తోడ్పడాలని క్రమశిక్షణతో మెలిగి చదువులలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ఉద్దేశించి ఆయన అన్నారు మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఎన్ సి సి క్యాంపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎస్సై చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాకాంత్, ఎన్ సి సి అధికారి బోరోజు యాదగిరి,ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి పరమేశ్వర చారి, సురేందర్ రెడ్డి, ధర్మరాజు, అరుణ్, తదితరులు పాల్గొన్నారు