Saturday, 7 November 2026

నా జీవితం ప్రజా సేవకు అంకితం

నా జీవితం ప్రజా సేవకు అంకితం
జహీరాబాద్ నవంబర్ 26( జనం సాక్షి) నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సేవ చేసి జహీరాబాద్ నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తానని బిజెపి జాతీయ ఐటీ సెల్ కన్వీనర్ జంగం గోపి స్పష్టం చేశారు శనివారం జహీరాబాద్ పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా కాలంలో తనను చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యల కారణంగానే ఎక్కడ పర్యటించకుండా ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చిందని ఆయన వివరించారు రానున్న కాలంలో జాహిరాబాద్ నియోజకవర్గం నుండి బిజెపి పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని ఈ విషయంలో ఎవరు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు ఒకవేళ నాకన్నా గొప్పవాలు పోటీ చేస్తా అంటే వారికి సపోర్టు చేస్తా అన్నారు. మాజీ మంత్రి జై గీతా రెడ్డి బిజెపి పార్టీలో చేరి బిజెపి పార్టీ అభ్యర్థిగా జహీరాబాద్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తే తాను ఆమె అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తానని వెల్లడించారు. కొందరు ఓటు బ్యాంకు లేని సీనియర్ల వైఖరి కారణంగానే బిజెపి పార్టీ జహీరాబాద్ లో నష్టపోతోందని వారిని తాను పట్టించుకోనని పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు దినేష్, అప్పం శ్రవణ్ కుమార్, అనిల్ కుమార్ రాథోడ్,ఝరాసంగం శ్రవణ్, ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.