Tuesday, 3 November 2026

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్స్,ఇళ్ల స్థలాలు ఇవ్వండి

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్స్,ఇళ్ల స్థలాలు ఇవ్వండి…

– టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేత…

నిర్మల్ ప్రతినిధి జనవరి 02 జనం సాక్షి

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్,ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డ్స్ అందేలా చూడాలని సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబుకు టీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవరర్గ, యూనియన్ సభ్యులు వినతిపత్రం అందించారు. అనంతరం టీయూడబ్ల్యూజే సభ్యులు పలువురు మాట్లాడుతూ…అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డ్స్,ఇండ్ల స్థలాలు,డబల్ బెడ్రూమ్స్ అందలని, మొదట గత నెలలో అక్రిడేషన్ కమిటీ 124 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు అవుతాయని లిస్టును ప్రకటించి,ఆ తర్వాత కేవలం 64 మందికె అక్రిడేషన్ ఇవ్వడం సరైనది కాదంటూ మిగతా అర్హులందరికీ వెంటనే అక్రిడేషన్లు మంజూరు చేయాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో టియుడబ్ల్యూ నిర్మల్ జిల్లా అధ్యక్షులు కొండూరి రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్, సభ్యులు గుమ్ముల అశోక్,వెంకటస్వామి,అమీన్ పటేల్,రషీద్ అలం,మోసిన్ హైమద్, శివరామకృష్ణ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.