అర్హులైన నిరుపేదలకు దళిత బంధు ఇవ్వాలి – మంథనిలో కాంగ్రెస్ నాయకుల ధర్నా, ఆర్డీవోకు
వినతిపత్రం సమర్పణ
జనంసాక్షి, మంథని : అర్హులైన నిరుపేదలకు మాత్రమే దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వినతిపత్రం అందించి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంథని అంబేడ్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా మంథని ఆర్డిఓ కార్యాలయం కు వెళ్లి డీ ఏవో కు వినతి పత్రం అందజేశారు.
అనంతరం నాయకులు ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు, ఎస్సీ సెల్ మంథని మండల అధ్యక్షులు మంథని రాకేష్ తదితరులు మాట్లాడుతూ..మంథని నియోజకవర్గంలో దళిత బంధు సంబంధించిన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయకుండా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఎంపిక చేసి ఇస్తున్నట్లు తెలిసినందున,ప్రభుత్వం వెంటనే గుర్తించి పార్టీలకు అతీతంగా అందరికీ పేద దళిత కుటుంబాలను పారిదర్శకంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శశి భూషణ్ కాచే, ఇనుముల సతీష్, కౌన్సిలర్ పెండ్రు రమారెడ్డి, పేరవేన లింగయ్య యాదవ్, జంజర్ల శేఖర్, మద్దెల రాజయ్య, కుడుదుల వెంకన్న, ఎరుకల ప్రవీణ్, మంథని శీను లతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.