Wednesday, 4 November 2026

అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని బీఎస్పీ నాయకుల డిమాండ్

 

 

 

 

 

 

ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం లోనీ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బుర్ర ఉపేంద్ర సాహు డిమాండ్ చేశారు.ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామంలో జి ప్లస్ వన్ విధానం లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సాహు మాట్లాడుతూ 2018 లో నిర్మాణం చేసిన ఇండ్లను నేటి వరకు కూడా పేదలకు కేటాయించకుండా వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారనీ విమర్శించారు. అధికార పార్టీ అండదండలు ఉన్నవారికి, అమాయక ప్రజల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఇండ్లు ఇస్తున్నారని అసలైన అర్హులైన పేదలకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఇండ్లు ఎవరికి కేటాయించక పోవడం వలన అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పేర్కొన్నారు.తలుపులు కిటికీలు శిధిలావస్థలో ఉన్నాయని ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి ఇండ్లు మంజూరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకుపల్లి నాగేశ్వర్ రావు,జిల్లా కార్యదర్శి మరియు పాలేరు అసెంబ్లీ ఇంఛార్జి బి.ఉపేందర్,జిల్లా కార్యదర్శి మిరియాల నాగరాజు, సోషల్ మీడియా జిల్లా ఇంఛార్జి శ్రీకాంత్ స్వేరో బచ్చలకూరి,బీఎస్పీ నాయకులు దారెల్లి రమేష్ తదిరులు పాల్గొన్నారు