వైరా ఫిబ్రవరి 9న (జనం సాక్షి)వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా BRS పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు మరియు జిల్లా దిశ కమిటీ సభ్యులు కట్టా కృష్ణ రావు మాట్లాడుతూ ….*ఆనాడు BRS పార్టీలో ఉండి ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడానికి కష్టపడ్డామని ప్రకటన చేసే మీరే నిజమైన వెన్నుపోటు దారులు , ఎమ్మెల్యే రాములు నాయక్ లేకపోతే మీ ఆధార్ కార్డు ఎక్కడుండేవి?తాడు బొంగరం లేని మీరు, ఏ పార్టీలో ఉన్నారు తెలియని మీరు, ఊరు- పేరు లేకుండా అభ్యర్థులు నిలబెట్టే మీరు ,BRS పార్టీ నాయకులను విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది* ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ 2014 నుంచి ప్రజల్లోనే ఉంటూ ,ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, ప్రజల అభిమానం పొందారని ,అందుకే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారని ,ఇది గుర్తుపెట్టుకుని మాట్లాడితే మంచిది.*ఈరోజు మీరు BRS పార్టీలో ఉండి ,పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి, ప్రస్తుత ఎమ్మెల్యే గారిని గెలిపించటం మా కష్టార్జితం అని ప్రకటన చేయటం పార్టీకి మీరు ద్రోహం చేసినట్టు కాదా?
* ఏ పార్టీ మ్యాండేటు నైతే మీరు గెలిచి ,ఉన్నత పదవులు అనుభవిస్తూ మరల అదే పార్టీకి వెన్నుపోటు పొడిచిన మీకు ఆ పదవులు అనుభవించడానికి అర్హత ఉందా? చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీ పదవులకు రాజీనామా చేయండి
* మీకు రాజకీయ బిక్ష పెట్టిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు రాబోయే రోజులలో మీకు వెన్నులో వణుకు పుట్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ బహిష్కరించిన ఇంకా కక్కినకూటికి ఆశపడి పదవులును పట్టుకుని వ్రేలాడే మీరా, BRS పార్టీని ,BRS పార్టీ ఎమ్మెల్యేని ? జిల్లా పార్టీ అధ్యక్షులును విమర్శించేది? ఇటువంటి చిల్లర రాజకీయాలు మీకు, మీ నాయకులకి సరిపోతాయి కానీ..
* మా నాయకులు కాంట్రాక్టులు చేసి అప్పన్నంగా వచ్చిన సొమ్ముతో రాజకీయాలు చేయడం లేదని, కోట్ల రూపాయలు అడ్డదారులలో సంపాదించలేదని ,పది సంవత్సరాల క్రితం మీ నాయకుడు పరిస్థితి ఏంటో ?ఇప్పుడు మీ నాయకుడు పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుసునని ,ధనమదంతో జనాలను కొందామని చూస్తే మీకు బుద్ధి ఎలా చెప్పాలో ప్రజలకు తెలుసని అన్నారు* నాలుగు సార్లు పార్టీలు మారిన మీరు , చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చి ఇప్పటికీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పేదమ్ములేని మీరు, అభ్యర్థులను ప్రకటించటం చూస్తే హాస్యాస్పదంగా ఉంది* గౌరవ MLC మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ ఆనాడుUSA లో ఉన్న ఈనాడు ఇక్కడ ఉన్న ఎప్పుడు కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ నిబద్ధత పనిచేసిన నాయకుడని, ఆయనలో ఉన్న సమర్థతను, క్రమశిక్షణను గుర్తించి పదవులను ఇచ్చారని ఇది గుర్తుపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు ఈనెల 15 తారీకున జరుగు ఆత్మీయ సమ్మేళడానికి BRS పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.ఈ ప్రెస్ మీట్ లో వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు ,వైరా మార్కెట్ చైర్మన్ బీ డే కే రత్నం ,వైరా మునిసిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు ,ఎంపీపీ వేల్పుల పావని జిల్లా దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునురావు జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎస్కే లాల్ మొహమ్మద్ సీనియర్ నాయకులు కౌన్సిలర్ విశ్వేశ్వరరావు, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్రావు ,జిల్లా నాయకులు మచ్చా బుజ్జి ,సీనియర్ నాయకులు డాక్టర్ కాఫా మురళీకృష్ణ ,మండల ప్రధాన కార్యదర్శి అమరనేని మాధవరావు ,మిషన్ భగీరథ రాష్ట్ర అధ్యక్షులు మద్దెల రవి ,సర్పంచ్ సంఘం అధ్యక్షులు సాధం రామారావు,ఎంపిటిసి వెంకటరామిరెడ్డి ,సీనియర్ నాయకులు కౌన్సిలర్ డాక్టర్ కోటయ్య ,ఎంపిటిసి ఎర్రమల సౌజన్య ,కోదండరామ దేవాలయ చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు, పులిగుట్ట చైర్మన్ మడుపుల సైదా,మండల బీసీ సెల్ అధ్యక్షులు వాకదారి వెంకటేశ్వరరావు ,మైనారిటీ అధ్యక్షులు ఎస్కే సైదా ,పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేష్, మండల కార్మిక విభాగం గంగదేవుల నరేష్ ,రూరల్ సోషల్ మీడియా కన్వీనర్ సింగారపు నరేష్ ,వైరా పట్టణ నాయకులు సూర్యదేవర శ్రీధర్ ఎదునూరి శ్రీను కర్నాటి హనుమంతరావు మరికంటి శివ తాటిపల్లి సుధీర్ కౌన్సిలర్స్ చల్లగొల్ల నాగేశ్వరరావు ఇమ్మడి రామారావు తడికమల్లి నాగేశ్వరరావు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వేల్పుల మురళి మండల కోశాధికారి మేరుగు రత్నరాజు,సర్పంచులు భద్రయ్య ,కోట ఎలీషా, పట్టణ నాయకులు లగడపాటి ప్రభాకర్ కన్నెగంటి హుస్సేన్ గుగులోతు రవి మండల నాయకులు కొప్పుల వెంకటేశ్వర్లు కష్టాల సత్యనారాయణ , తాటిపూడి ఉపసర్పంచి సత్యానంద్ ,దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు




