
ఏటూరు నాగారం ( జనం సాక్షి)జూన్ 30 .ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ (బి ఎస్ పి )ఏటూరునాగారం మండల అధ్యక్షులు ఎంపెల్లి రాజు ఆధ్వర్యంలో పోడు పట్టాల గురించి కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బి ఎస్ పి ములుగు అసెంబ్లీ ఇంచార్జీ గడం బిక్షపతి గౌడ్ మరియు బి స్ పి ములుగు అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎంపెల్లి వీరాస్వామి హాజరైన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి బి ఎస్ పి ములుగు అసెంబ్లీ ఇంచార్జి గడం బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ మారుమూల అటవీ ప్రాంతం అయినా ఏటూరునాగారం సబ్ డివిజన్పరిధిలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం,తాడ్వాయి అటవీ ప్రాంతాలలో ఆదివాసీ, దళిత, పేద బి సి లు అడవినే నమ్ముకొని పోడు వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు.తెలంగాణ వస్తే మా బ్రతుకులు మారతాయని కెసిఆర్ ను నమ్మి ఓట్లు వేస్తే తొమ్మిది సంవత్సరాలనుండి ఒక్క ఎకరానికి కూడా పట్ట ఇవ్వని కెసిఆర్ ఎలక్షన్ లు వస్తున్నాయని పోడు పట్టాలు ఇస్తున్నానని మాయమాటలు చెప్పి, వేలల్లో అప్లికేషన్ లు వస్తే, వందలల్లో పోడు పటాలు ఇస్తూ, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు.అప్లై చేసుకున్న,అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు పటాలు ఇచ్చి, వెంటనే రైతు బంధు ఇవాలని, లేని యెడల బి ఎస్ పి పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ ఎస్. ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పోడు రైతుల కోసం ఆందోళన కార్యక్రమాలు చెపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హరికృష్ణ, రాజు, రామకృష్ణ, పోడు రైతులు, మహిళలు పాల్గొన్నారు.




