జనంసాక్షి, కమాన్ పూర్: లయన్స్ క్లబ్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల నూతన కమిటి నియామకం ప్రక్రియ శుక్రవారం మండల కేంద్రంలోని ఆదివరహస్వామిఆలయ కమ్యూనిటీహాల్ నిర్వహించడం జరిగింది. మండల అధ్యక్షులుగా కాంట్రాక్టర్ సాన రామకృష్ణారెడ్డి (జూలపల్లి), ప్రధాన కార్యదర్శిగా నల్లవెల్లిశంకర్ (కమాన్పూర్), కోశాధికారిగా డాక్టర్ పెద్దగంధం విజయకుమార్ (కమాన్పూర్), ఉపాధ్యక్షులుగా ముస్త్యాల దామోదర్ (జూలపల్లి), పిన్రెడ్డి కిషన్రెడ్డి (కమాన్పూర్), సర్వీస్ చైర్మన్ మచ్చగిరి రాము(కమాన్పూర్), సహాయక కార్యదర్శిగా తిమ్మరాజు శరత్ కుమార్(కమాన్పూర్), బోర్డ్ ఆఫ్
డైరక్టర్స్ ఇనగంటి భాస్కర్రావు (కమాన్పూర్), ఇనగంటి రామారావు (కమాన్పూర్), బొల్లపెల్లి శంకర్ గౌడ్ (జూలపల్లి), కోలేటి చంద్రశేఖర్(కమాన్పూర్), బొజ్జ రాజసాగర్ (కమాన్పూర్)లు నియమితులయ్యారు. ఈ లయన్సక్లబ్ మండల నూతన కమిటి ఎన్నిక ప్రక్రియకు డాక్టర్ టి.వెంకటేశ్వర్రావు, బాబురావుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు గడప కృష్ణమూర్తి, వైనాల రాజు, తాటికొండ శంకర్, శెవ్వ శంకరయ్య, రామగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముల్మూరి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, పెద్దపల్లి లయన్స్ క్లబ్ సభ్యులు సంపత్ రావు, అశోక్ కుమార్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా సాన రామకృష్ణారెడ్డి




