Sunday, 8 November 2026

అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

హన్మకొండ బ్యూరో చీఫ్ 26 జనంసాక్షి

18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి యువతి, యువకులందరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్ నిర్వహిస్తున్న పోలింగ్ బూత్ కేంద్రము ను శనివారం ఉదయం పింగళి కళాశాల, కాజీపేట లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం వారిగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించాలని, 18 సంవత్సలు నిండిన యువతి, యువకులతో పాటు దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్ లను ఓటర్లుగా నమోదుచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లకు వారి వివరాలలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతుందని, బిఎల్ఓ లు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేయాలని, చనిపోయిన వారి వివరాలను జాబితా నుండి తొలంగించాలని తెలిపారు, పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు, ఎలక్షన్ సిబ్బంది అందరు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తుది ఓటరు జాబితా ప్రచురణకు ముందు ఒకటికి రెండు సార్లు ఫోటోలు, పేర్లు, ఇతర వివరాలను బూత్ స్థాయి అధికారులు సరిచూసుకోవాలని, పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రముఖులు, వి.ఐ.పి, ప్రజా ప్రతినిధుల ఓటు వివరాలు చెక్ చేయాలని అన్నారు.

ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు జరగాలని, పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చిన. ఫారం 7 దరఖాస్తులను పరిశీలించి సదరు ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా విచారించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు

ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతివారం నమోదవుతున్న నూతన ఓటరు వివరాలు, తోలగిస్తున్న ఓటరు వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేయాలని కలెక్టర్ బి.ఏల్.ఓ లను ఆదేశించారు.

పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న దివ్యాంగ ఓటర్ల వివరాలు చిరునామా తో మ్యాప్ చేసి పెట్టుకోవాలని, ఇక్కడ సమయంలో వారి కోసం వాహనాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు.
ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓట్లు, లాజికల్ ఎర్రర్స్ డెమోగ్రాఫిక్ ఎర్రర్స్ పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి వాసు చంద్ర , తహిసీల్దార్ కిరణ్ కుమార్, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.