Thursday, 5 November 2026

ఓటరు నమోదు పరిశీలించిన ఆర్డివో

ఓటరు నమోదు పరిశీలించిన ఆర్డివో.
బెల్లంపల్లి, డిసెంబర్ 4, (జనంసాక్షి )
ఓటరు నమోదు స్పెషల్ డ్రైవ్ ను ఆదివారం బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవి పరిశీలించారు. పోలింగ్ బూత్ లను తిరిగి బూత్ లెవల్ అధికారుల పనితీరును పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటు అనే వజ్రాయుధంతో సుపరిపాలన తెచ్చుకోవాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది చాలా విలువైనదని ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట నెన్నెల తహసీల్దార్ భూమేశ్వర్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు