Wednesday, 4 November 2026

అలంపూర్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

అలంపూర్ మే25 జనంసాక్షి నియోజకవర్గం లోని పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు.అలంపూర్ మున్సిపాలిటీలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రిలో గురువారం డయాలసిస్ సెంటర్నుఅలంపూర్శాసనసభ్యులుడాక్టర్.వి.యం.అబ్రహంప్రారంభించారు.ఈసందర్బంగాఎమ్మెల్యేమాట్లాడుతూ ఏదైనా జబ్బు చేసి ఆస్పత్రికి వెళ్ళితే చికిత్స కంటే వైద్య పరీక్షలకే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి,మూత్ర పరీక్ష నుంచి రక్త పరీక్ష వరకు ఏవేవో టెస్ట్‌లు రాస్తారు అన్నారు. డాక్టర్ వాటికి వేలకు వేలకు పోయాల్సి ఉంటుంది, సామాన్య ప్రజలపై ఈ భారం పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది అని అన్నారు.అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అని ఆయన అన్నారు . ఆస్పత్రుల స్థాయి ఆధారంగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల సేవలను అందించనున్నారు.సమైక్య రాష్ట్రంలో కేవలం 7 మెడికల్ కాలేజీలు
ఇప్పుడు జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్ పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు చర్యలు
ఆరోగ్య శ్రీ, సిఎం ఆర్ ఎఫ్ , ఎల్ ఓ సి లు అందజేస్తున్నాం అన్నారు.లక్షలాది రూపాయల చికిత్సలకూ ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ దే అని అన్నారు.డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ కు నియోజక వర్గ ప్రజల తరుపున అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ మనోరమ, డాక్టర్ లు వివిధ శాఖల కౌన్సిలర్లు మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు పార్టీ నాయకులు,అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.