Wednesday, 4 November 2026

ఉద్యమాలకు ఊపిరి కళాకారులే.. అర్హత కలిగిన కళాకారులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలం – మాజీ ఎమ్మెల్యే పొతరాజు సారయ్యా

 

హన్మకొండ ప్రతినిధి 25 మే జనంసాక్షిరోజున జిల్లా లో హనుమకొండ చౌరస్తా బిఆర్ భగవాన్ దాస్ గారి కూడలి సెంటర్లో IPTA 80 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు, అనంతరం జెండా మాజీ ఎమ్మెల్యే పోతారాజు సారయ్యా ఆవిష్కరణ చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజానాట్య మండల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించినదుకు చాలా సంతోషంగా ఉందన్నారు,దేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచె ఘనత కేవలం కళాకారులకే దక్కింది అన్నారు, స్వసంత్రం తెచ్చినటువంటి ఘనత ముఖ్య పాత్ర కళాకారులకే దక్కును అన్నారు,అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులు కాలు గజ్జ కట్టి గొంగడి వేసుకొని ప్రజలను చైతన్యవంతులు చేస్తూ సాయుధ పోరాటంలో అనేక ఉద్యమాల పాల్గొన్న కళాకారుల పాత్ర గణనీయమైందని,ఆయన పేర్కొన్నారు,మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసి, తిండి తిప్పలు, నీళ్లు లేకున్నా గొంతు ఎండి పోతున్న ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆటపాటల ధూంధాం కార్యక్రమాలతో తెలంగాణలో కీలకపాత్రులై తెలంగాణ సాధించి పెట్టింది కళాకారులే అన్నారు, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు చిన్న చూస్తూ అరాకొర 500 ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ వ్యాప్తంగా నిజమైన కళాకారులను గుర్తించకుండా రోడ్డున పడేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీదాని ఆయన ఏదేవ చేశారు ఇప్పటికైనా నిజమైన కళాకారులకు గుర్తించి ఉద్యోగాలు కల్పించాలని, అదేవిదంగా ఉద్యమలకు ఊపిరి అయినా కళాకారుల కుటుంబ లను, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు,కళాకారులకు హెల్త్ కార్డులు,బస్సు పాసులు, అర్ధులైన కళాకారులకు పదివేల పింఛను, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే అమలు చేసి ఇవ్వాలని ఆయన ప్రభుత్వంని కోరారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి తెలంగాణ ప్రజానాట్యమండలి హనుమకొండ జిల్లా కార్యదర్శి కొట్టేపాక రవి అధ్యక్షత వహించారు జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అంబి సాంబయ్య అమృతయా రాజేందర్ పల్లె రామ రాజారపు అనూష శిరీష సరిత గుడికందుల శివకుమార్ రెంటాల దేవా గోపి గణపురం అనుష ఐలయ్య భూషణం తదితర కళాకారులు పాల్గొన్నారు.