Wednesday, 4 November 2026

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

నెన్నెల, మే 25, (జనంసాక్షి )
నెన్నెల మండలం ఆవడం గ్రామంలో గురువారం ఎంపీపీ సంతోషం రమాదేవి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, పరిసర ప్రాంతాల రైతులు ఈకొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా వరికొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాలని సూచించారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చీర్ల సత్తమ్మ, నాయకులు సంతోషం ప్రతాప్ రెడ్డి, చీర్ల మొండన్న, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.