Wednesday, 4 November 2026

అలంపూర్ ఉర్సు మహోత్సవంలో పాల్గొన్నా ఎమ్మెల్యే అబ్రహం,ఎమ్మెల్సీ చల్లా

అలంపూర్ జూన్ 13 (జనంసాక్షి)అలంపూర్ మున్సిపాలిటీలో హజ్రత్ శాలి పహిల్వాన్ దర్గా 772 వ ఉర్సు సందర్బంగా దర్గా లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి పెద్ద కిస్తీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఉర్సు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి దర్గా లో ప్రత్యేక ప్రత్యేక ప్రార్ధన చేశారు.
ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ , కో ఆప్షన్ మెంబర్ అల్ల భాకష్ , బైరం పల్లి సర్పంచ్ వెంకటేశ్వర్లు , కొనేర్ ఉప సర్పంచ్ నరసింహ ,రాధాకృష్ణ , అంజనేయలు , దర్గా కమిటీ పెద్దలు పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు