భీమదేవరపల్లి:జూన్(13)జనం సాక్షి న్యూస్మండలంలోని ముల్కనూర్ గ్రామానికీ చెందిన మంగ శివకుమార్ (14) అనే విద్యార్థి మంగళవారం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. బావిలోకి దూకినట్లు పెద్ద శబ్దం రావడం, బావి ఒడ్డున చెప్పులు ఉండటంతో రైతులు ఆ వ్యవసాయ బావి యజమానులకు సమాచారం అందించారు. బావిలో నీరు ఎక్కువ ఉండటంతో గజ ఈతగాళ్లు బావిలోకి దూకి వెతికినా ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో మోటార్లు పెట్టి నీటిని తోడటంతో శివ కుమార్ మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృత దేహాన్ని తాళ్ల సహాయంతో బయటకు తీశారు. బడికి పొమ్మని తల్లిదండ్రులు చెప్పినందుకే క్షణికావేశంతో బావిలో దూకి ఆత్మ హత్య చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు. సంఘటన స్థలానికి ముల్కనూర్ పోలీసులు వెళ్లి మృత దేహానికి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బావిలో దూకి విద్యార్థి ఆత్మహత్య




