Wednesday, 4 November 2026

తెలంగాణ వినియోగ దారుల మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా లక్ష్మి నారాయణ

:శామీర్ పేట్, జనం సాక్షి :మంగళవారంరోజు తెలంగాణ వినియోగదారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అంబు రాథోడ్ సలహా సూచన మేరకు మేడ్చల్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేస్తూ వాటికి నియామక పత్రాలను అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రొండా మల్లారెడ్డి మేడ్చల్ పూడూరు హరిహర నందన అయ్యప్ప దేవస్థాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ కన్వీనర్ సింబల్ రాథోడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోత్వాల్ దయానంద్ , రాష్ట్ర మీడియా ప్రతినిధి పెంట స్వామి , ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందించి వారికి పూర్తి అవగాహన కల్పిస్తూ బి ఐ ఎస్ ప్రతినిధులు ప్రశాంతి మరియు విదిష తో వినియోగదారులు నష్టపోకుండా ప్రతి చిన్న వస్తువు నుండి బంగారం కొనుక్కునే వరకు కల్తికి ఏ విధంగా జరుగుతుందో వాటిని గుర్తించే విధంగా పూర్తి అవగాహన కల్పించిన ప్రోగ్రాం లో నూతన రాష్ట్ర కమిటీ సభ్యులకు కన్స్యూమర్ ఫోరం ఐడి కార్డులు ఇచ్చిన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ సభ్యులకి జిల్లా మేడ్చల్ జిల్లా కమిటీ సభ్యులకి అలాగే రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా కమిటీ సభ్యులకి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన కార్యక్రమం నిర్వాహకలు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రెండ మల్లారెడ్డి తెలిపారు.