అలంపూర్ జనంసాక్షి (జనవరి 26) గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రం లో పరేడ్ గ్రౌడ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జారపూకున్నారు. అనంతరం ప్రభుత్వం విశిష్ట సేవలను గుర్తించి ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రభుత్వం అందించే ప్రశంస పత్రలు అందజేశారు. అందులో భాగంగా అలంపూర్ ఎస్ఐ శ్రీహరి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. అలంపూర్ మండలం లో పనిచేసి ఉత్తమ సేవ అవార్డు వచ్చినందుకు మండల ప్రజలు ఎస్ఐ శ్రీహరి కి శుభాకాంక్షలు తెలుపుతూ, మునుముందు ప్రజలకు మరింతగా సేవలు అందించాలని, ఉన్నత పదవులకు చేరుకోవాలి, మరిన్ని అవార్డు ఎందుకోవాలని కోరుకుంటున్నారు.




